Feb 11,2023 23:48

ముఖ్య అతిథికి జ్ఞాపిక అందజేస్తున్న వర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాష్‌

ప్రజాశక్తి-సబ్బవరం
మండలంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో వాయు రవాణా నిర్వహణ, విమానయాన చట్టాలపై శనివారం సెమినార్‌ నిర్వహించారు. విశ్వవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ ఇంటలెక్చవల్‌ ప్రాపర్టీ రైట్స్‌, టెక్నాలజీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ సెమినార్‌కు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.బాలకృష్టారెడ్డి, కోల్‌కతా నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జుడీషియల్‌ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ సందీప్‌ భట్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ బాలకృష్ణరెడ్డి విమానయాన చట్టం నియంత్రణ గురించి, వైమానిక చట్టాలకు సంబంధించిన అతి ముఖ్యమైన చికాగో కన్వేర్షన్‌, అంతర్జాతీయ విమానయాన విధానాలను గురించి వివరించారు. ప్రొఫెసర్‌ సందీప్‌ భట్‌ మాట్లాడుతూ విమానయాన సంబంధిత వివాదాల పరిష్కారం కోసం అంతర్జాతీయ వేదికల్లో చర్చలు ఉత్తమమైనవని తెలిపారు. వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌.సూర్యప్రకాష్‌ భారత వైమానిక చట్టం, భారత ఉడాన్‌ స్కీం గురించి వివరించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పేపర్‌ ప్రెజెంటేషన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మధుసూదనరావు, అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్‌ శ్రీసుధ, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.