సత్తెనపల్లి టౌన్: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, స్వాతంత్య్ర సమర యోధులు , మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య నిరాడంబర జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానికంగా నిర్వహించిన వావి లాల 118వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వావిలాల జీవన విధానం నేటి రాజకీయ నాయ కులకు ఆదర్శనీయం అన్నారు . అనం తరం వావిలాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివా ళులు అర్పించారు. వావిలాల మనవడు సోడేకర్ ఆధ్వ ర్యంలో పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్య క్రమంలో మాజీ శాసన సభ్యులు వై.వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు మిర్చియర్డు చైర్మన్ ఎన్ రాజ నారాయణ, స్థానిక యార్డు చైర్మన్ పి.బాబు రావు, ప్రజ్వలన సంస్థ నిర్వాహకులు బి.పూర్ణచంద్రరావు, కమిషనర్ కె. షమ్మి పాల్గొన్నారు .










