Apr 15,2022 12:20

వాట్సప్ లో ఇక నుండి ఒకేసారి 32 మంది గ్రూపు కాల్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్ తో మరిన్ని ఫీచర్లు త్వరలో రానున్నాయని మెటా ప్లాట్ ఫార్మ్స్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ గురువారం వెల్లడించారు. అంతేకాకుండా 2 గిగా బైట్ల పరిమాణంలో గల ఫైళ్లను షేర్ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. వాట్సప్ గ్రూపు అడ్మిన్ కు మెసేజులను తొలగించే ఫీచర్ కూడా త్వరలో రాబోతుంది. ఈ కొత్త ఫీచర్లతో మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది వాట్సప్. ఇప్పటి వరకు కేవలం 8మందితోనే గ్రూపు కాల్ చేసే అవకాశం ఉంది. గిగా బిట్ మించని ఫైళ్లను మాత్రమే షేర్ చేయగలుగుతున్నాం.