గుంటూరు: జిల్లాలో మిషన్ వాత్సల్య పధకం స్పాన్సర్‌షిప్ అండ్ ఫాస్టర్ కేర్ కార్యక్రమా నికి అందించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయి లో పరిశీలించి సక్రమంగా పరిష్క రిం చాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణు గోపాల్ రెడ్డి ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఎం.వేణు గోపాల్‌రెడ్డి అధ్యక్షతన స్పాన్సర్ షిప్ అండ్ ఫాస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సం యుక్తంగా మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ అండ్ ఫాస్టర్ కేర్ కార్యక్రమం ద్వారా వితం తువులు, విడాకులు పొందిన మహిళల పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయి సంరక్ష కుల వద్ద ఆశ్రయం పొందుతున్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలు, కుటుంబాలలోని పిల్లలు, పీయం కేర్ పథ కం క్రింద నమోదైన పిల్లలకు ఈ పథకం ద్వారా ప్రతి నెల ఆర్ధిక సాయం అందిస్తుం దన్నారు. జిల్లాలో ఈ పథకానికి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరి శీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాల న్నారు. సంరక్షణ గహాల్లో ఆశ్రయం పొం దుతున్న పిల్లలకు ఇంటి వాతావరణం ఉం డేలా సౌకర్యాలు కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు చర్యలు తీసు కోవాలన్నారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ప్రమీల, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిణి మనోరంజని, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిణి దుర్గా భవాని, శిశు గహం మేనేజర్ శరణ్యా, సీడ్స్ యన్ జి ఓ డైరెక్టర్ రోషన్ కుమార్ పాల్గొన్నారు.










