Dec 26,2022 00:05

శంకస్థాపన చేస్తున్న సర్పంచ్‌

ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలో బిబి.పట్నం గ్రామంలో గ్రామ సర్పంచ్‌ ఈశ్వరరావు ఆధ్వర్యంలో వాటర్‌ ట్యాంక్‌కు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ జల జీవన్‌ మిషన్‌ పథకంలో గ్రామానికి రూ.80లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. వాటర్‌ ట్యాంక్‌కు రూ.52లక్షలు, ఇంటింటికి పైపులైన్‌కు రూ.28లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ ట్యాంక్‌ నిర్మాణం పూర్తయితే గ్రామంలో అందరికి తాగునీరు సరఫరా అవుతుందని, దీంతో ప్రజలందరికి దాహార్తి తీరుతుందన్నారు.