Oct 26,2023 22:07


ప్రజాశక్తి- చిత్తూరు: అమృత్‌ సరోవర్‌ పనులు రైతులకు ఉపయోగపడే విధంగా అధికారులు కృషి చేయాలని, వాటిని భూగర్భ జలాల పెంపొందించేందుకు అనువుగా రూపుదిద్దుతే చర్యలు మరింత చేపట్టాలని కేంద్ర జలశక్తి బందం కోరారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సదుం, సోమల, చౌడేపల్లి, బంగారుపాళ్యం మండలాల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమృత్‌ సరోవర్‌ చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాం పనులను కేంద్ర జలశక్తి అభియాన్‌ కమిటీ బందం నోడల్‌ ఆఫీసర్‌ సచీంద్ర కుమార్‌ పట్నాయక్‌, శాస్త్రవేత్త సోమరేంద్రో సింగ్‌ పరిశీలించారు. అమృత్‌ సరోవర్‌, ఫీడర్‌ చానల్‌ చేపట్టిన అభివద్ధి పనుల పురోగతిని కమిటీ బందం పరిశీలించి చెక్‌ డ్యాంలు నిర్మించడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాయాలున్నాయని కమిటీబృందం రైతులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. చెక్‌ డ్యామ్స్‌లు ఏర్పాటు చేయకముందు వ్యవసాయ బోర్లులో నీరులేక పంటలు ఎండిపోయాయని, చెక్‌ డ్యాంల వల్ల చుట్టుపక్కల బోర్డులలో నీటి శాతం పెరిగిందని, దీనివల్ల రైతులకు వ్యవసాయానికి ఎంతోగానో ఉపయోగకరంగా ఉందని రైతులు కమిటీ బృందానికి వివరించారు. అమృత్‌ సరోవర్‌, చెక్‌డ్యామ్స్‌ పనులకు సంబంధించి వర్క్‌అర్డ్స్‌ను, యం బుక్స్‌ను పరిశీలించారు. కమిటీ వెంట డ్వామా పిడి గంగభవాని, వాటర్‌షెడ్‌ అదనపు పిడి ఉమాదేవి, ఏపిడీలు సునీల్‌, శ్రీనివాసులు, నీలిమా, వాటర్‌ షెడ్‌ పిఓలు, ఏపిఓలు, రైతులు ఉన్నారు.
సోమల: మండలంలో వాటర్‌ షెడ్‌ పథకం కింద చేపట్టిన పనులను కేంద్ర జలశక్తి అభియాన్‌ కమిటీ బందం గురువారం తనిఖీ చేసింది. ఎస్‌ నడింపల్లె పంచాయతీ సూరయ్యగారిపల్లె సమీపంలో లక్ష 57 వేల రూపాయలతో నిర్మించిన అమత్‌ సరోవర్‌ చెరువు, ఇరికిపెంట వద్ద 3లక్షల 87 వేల రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యాం పనులను కేంద్ర బృందం నోడల్‌ ఆఫిసర్‌ సచీంద్రకుమార్‌ పట్నాయక్‌, సైంటిస్ట్‌ డాక్టర్‌ సోమంరేద్రో సింగ్‌ పరిశీలించారు.