
ప్రజాశక్తి - వేటపాలెం
అంగన్వాడి కార్యకర్తలు పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చి చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈవోఆర్డి సజ్జ శ్రీలక్ష్మి అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పందిల్లపల్లి, దేశాయిపేట సెక్టార్లలో ఉన్న 47 సెంటర్లకు వాటర్ క్యాన్లను బహుకరించారు. బేసిక్ ఎడ్యుకేషన్సి ప్రోగ్రాంలో భాగంగా ఈ క్యాన్లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా దేశాయిపేటకు చెందిన అంగనవాడి కార్యకర్తలు పౌష్టికాహార పదార్థాలను తయారు చేసుకొని ప్రదర్శించారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బట్ట మోహనరావు, కార్యదర్శి ఎవి సురేష్, కోశాధికారి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, రోటరీ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి సీతారాం, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సబ్జా పుష్పవల్లి, సజ్జ లీలావతి, రోటరీ సభ్యులు ప్రతి వెంకట సుబ్బారావు, నున్న నాగేంద్రరావు, కొత్త వాసు, ఎస్ శివరామకృష్ణ, బండారు రాజేష్, బాబురావు పాల్గొన్నారు