వినుకొండ: ప్రపంచ వైద్యుల దినోత్సవ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ సెక్రటరీ కజ్జాయం విజయలక్ష్మి ఆధ్వ ర్యంలో వినుకొండ పట్టణంలోని నిమ్స్24 హాస్పటల్‌లో ఆది వారం ఘనంగా డాక్టర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎముకల వైద్యులందరినీ ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వాసవి క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని అలాగే వైద్యుల్ని కూడా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాట్లాడుతూ డాక్టర్ బిపి రాయి జయంతిని పురస్కరించుకుని డాక్టర్ నిర్వహించడం జరుగుతుందని అలాగే అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మ ప్రసాదిస్తారని తెలియజేశారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ మండవ వెంకట కిరణ్ కుమార్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గజవల్లి నాగ పవన్ కుమార్ జోన్ చైర్మన్ పేరూరు కష్ణ వాసవి యూత్ అధ్యక్షులు అరవింద్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ మండవ హైమావతి జోన్ చైర్మన్ శైలజ ఉషారాణి, బెల్లంకొండ ప్రసాద్ ,జ్యోతి, గుడిపాటి లక్ష్మీ రాజ్యం, రామడుగు లక్ష్మి, రాము, చందలూరు రవి, బ్రహ్మం వాసవి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










