Nov 14,2023 21:38

వాసుదేవ్‌ ఆచార్యకు నివాళ్లు అర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : వాసుదేవ్‌ ఆచార్య లేని లోటు ప్రజాఉద్యమానికి తీర్చలేనిదని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. వాసుదేవా ఆచార్య మరణానికి సిపిఎం జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. సిపిఎం మాజీ ఎంపీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సీనియర్‌ నాయకులు వాసుదేవ ఆచార్య సోమవారం హైదరాబాద్‌లో మరణించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి సిపిఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాటాడుతూ కార్మిక, పేద ప్రజల గొంతు పార్లమెంటులో వినిపించారని, పార్టీ ఉద్యమంలో అతనిలోటు పూడ్చలేనిదని తెలిపారు. అతని ఆశయాలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకలు కె.అవినాష్‌, వై.మన్మధరావు, మండంగి శ్రీను, వి.ఇందిర, వెంకట్రావు, వాసు, మండంగి రమణ తదితరులు పాల్గొన్నారు.