ప్రజాశక్తి- పెడబయలు : వారపుసంతల్లో గిరిజనోత్పత్తులు అటవీ ఉత్తత్తుల కొనుగోళ్లు, గిట్టుబాటు ధర కల్పన, తూకాల్లో మోసాలపై జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం పెదబయలు వారపుసంతలో స్టానిక వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తనిఖీలు చేపట్టారు. 16మంది సచివాలయ సిబ్బందితో కలిసి, సంతలో పర్యటించి, గిరిజనులు పండిస్తున్న వాణిజ్య దినుసులను గిట్టు బాటు ధర ఎలా లభిస్తుందని పరిశీలించారు. ప్రధానంగా వలిసెలు, పసుపు,రాజ్మా చిక్కుళ్లు తదితర గిరిజనోత్పత్తులు మాడుగుల ప్రాంతానికి చెందిన మైదాన ప్రాంత వ్యాపారులు కొనుగోలు చేస్తుండడానికి గమనించి, తూకాలపై నిఘా పెట్టారు. ఈ సందర్భంగా మైదాన ప్రాంత వ్యాపారులు తూకాల్లో మోసం చేస్తున్నట్లు గుర్తించి హెచ్చరించారు. అలాగే గిట్టుబాటు ధర కల్పించడం లేదని గుర్తించారు. ఇకనుంచి వారపుసంతల్లో గిరిజనోత్పత్తుల కొనుగోళ్లపై నిరంతరం నిఘా ఉంటుందని, గిరిజనులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.










