Oct 29,2022 21:17

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
              బోయవాల్మీకి, బెంతో ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చొద్దని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని నందాపురంలో గిరిజన సంఘం మండల ఆరో మహాసభ జరిగింది. తొలుత సంఘం సీనియర్‌ నాయకులు చోడెం దుర్గారావు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ బోయవాల్మీకి, బెంతో ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. గిరిజన జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్‌ నియమకానికి ఇచ్చిన జిఒ 52ను రద్దు చేయాలని, లేని పక్షంలో ఆదివాసీ సంఘాలతో ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, మండల అధ్యక్షులు పద్దం గంగాధర్‌, సిఐటియు మండల కార్యదర్శి పొడియం రాజు, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు బి.కిషోర్‌ మాట్లాడారు.
మండల కమిటీ ఎన్నిక
గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులుగా కారం భాస్కర్‌, పోలోజు నాగేశ్వరావు ఎన్నికయ్యారు. అలాగే చుండ్రు బుల్లెమ్మ, చోడెం దుర్గ, కొయ్యల శ్రీను, తెల్లం వెంకటలక్ష్మి, పూనెం మల్లేశ్వరరావు, రవ్వా దుర్గారావు, పోసిరెడ్డి, పొడియం భీమరాజు, చోడెం దుర్గారావు, కట్టం వెంకటేశ్వరరావు, తెల్లం మునేశ్వరరావు, సిహెచ్‌.శ్రీను, కారం సూర్యచంద్రం, ఉనుముల సూర్యచంద్రంతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.