భీమడోలు : గుండుగొలను కేంద్రంగా వికలాంగుల సంక్షేమంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీవిఘ్నేశ్వర వికలాంగుల సేవా సమితి సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. గుండుగొలనులోని సేవాసమితి కార్యాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఏలూరు శ్రీకృష్ణా హాస్పిటల్‌కి చెందిన వైద్య ప్రముఖులు వైద్య సేవలను అందించి, వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో హాస్పటల్‌కు చెందిన వైద్యులు డాక్టర్ బి.కృష్ణ, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్ రెడ్డి సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు, స్థానిక దాతలు, ప్రముఖులు దాట్ల రామకృష్ణంరాజు, వగ్వాల శ్రీరామచంద్రమూర్తి, పేరిచర్ల శ్యామల రాజు వైద్యులను సత్కరించారు.










