Aug 14,2023 18:56

పత్రం అందజేస్తున్న దృశ్యం

పత్రం అందజేస్తున్న దృశ్యం
వార్డులు ఏకగ్రీవం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:మండలంలోని కోవెరపాళెం గ్రామ పంచాయతీ 6వ వార్డు (ఎస్‌సి), పే డూరు గ్రామ పంచాయతీ 8వ వార్డు (కష్ణారెడ్డిపాలెం) (ఎస్‌సి) ఏకగ్రీవమైనట్లు ఎన్నికల ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌, ఎంపీడీఓ కన్నం హేమలత సోమవారం ప్ర కటించారు. ఈ రెండు వార్డుల సభ్యులు అనారోగ్యం కారణంగా మతి చెందడం జరిగింది. దాంతో ఈ రెండు వార్డుల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రెండు వార్డులకు ఒకొక్క నామి నేషన్‌ నక్కా మనోహర్‌ (కోవెర పాలెం), ఉయ్యాల బేబి (కష్ణా రెడ్డిపాలెం) మాత్రమే దాఖలు కావడంతో ఈ రెండు వార్డులు ఏ కగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు డిక్ల రేషన్‌ పత్రాలను వార్డు సభ్యులకు అందజేశారు. ఏకగ్రీవమైన ఈ రెండు వార్డులు వైసీపీ ఖాతాలో పడ్డాయి. పోటీ లేకుండా వార్డులు ఏకగ్రీవం కావడం వెనుక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సహాయ సహకారాలున్నట్లు తెలిపారు.