వార్డ్ మెంబర్‌కు అభినందనలు
ప్రజాశక్తి-సీతారామపురం : ఇటీవల పంచాయతీ నోటిఫికేషన్ విడుదలై జరిగిన ఉప ఎన్నికలలో సీతారామపురం పంచాయతీలోని 6వ వార్డుకు నోటిఫికేషన్ విడుదల చేయగా టిడిపి మద్దతు దారుడైన బండి రవికుమార్ ఏక్రగీవంపై మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని రామారావు శాలువా కప్పి అభినందించారు. అనంతరం బొల్లినేని రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలలో టిడిపి ప్రభంజనం సృష్టించిందని ఇటీవల జరుగుతున్న ప్రతి ఎన్నికలలో వైసిపికి ఎదురుగాలి ఎదురవుతుందనేది స్పష్టమవుతుందన్నారు. రాబోయే 2024 ఎన్నికలలో కూడా ఇదే తరహాలో టిడిపి విజయదుందుభి మోగించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.










