Oct 21,2023 20:04

అధికారులకు వినతిపత్రం ఇస్తున్న గుడిసె ఆది కృష్ణమ్మ

ప్రజాశక్తి - ఆదోని
వారానికో రోజు నీరు వదులుతున్నారని, వారానికి రెండుసార్లు కావాలని చాలామంది ప్రజలు అడుగుతున్నారని, అక్కడక్కడ పబ్లిక్‌ ట్యాప్స్‌ పెట్టాలని కూడా అడుగుతున్నారనిటిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు. శనివారం ఆదోనిలోని మండగిరి గ్రామ పంచాయతీలో 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. పర్యటించి వార్డులో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొన్నిచోట్ల డ్రెయినేజీ సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. చాలా చోట్ల రోడ్లు గుంతలుగా మారి, ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వంక ముళ్లకంపలు, చెత్తాచెదారంతో నిండి దుర్వాసన వస్తోందని, అనారోగ్యాలకు గురవుతారని తెలిపారు. రాజీవ్‌ గాంధీ నగర్‌ లో బైపాస్‌ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు దారి లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కిరాయిత సుదర్శన్‌ అనే అబ్బాయికి వికలాంగుల కింద పింఛను మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎంపిడిఒ గీతావాణికి వినతిపత్రం అందజేశారు. నాయకులు మురళీ, పట్టణ ముస్లిం, మైనార్టీ నాయకులు సాధిక్‌ వలీ, బాబురావు, రవి, శాంతరాజ్‌, చిరంజీవి, భారత్‌, వీరేష్‌ పాల్గొన్నారు.