Jul 29,2021 11:57

తిరువనంతపురం : కేరళలో కరోనా మరోసారి ఉధృత రూపం దాల్చుతోంది. దీంతో అక్కడ వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో వరుసగా రెండవ రోజు కూడా 20 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జులై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
కాగా, కోవిడ్‌ పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆరుగురుతో కూడిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ బృందాన్ని కేరళకు తరలించింనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఇప్పటికీ కేరళలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని, కరోనాపై పోరు చేస్తున్న రాష్ట్ర చర్యలకు ఈ బృందం సాయం చేస్తుందని ట్వీట్‌ చేశారు.