Jun 14,2023 21:40

ర్యాలీ నిర్వహిస్తున్న జనసేన నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
వారాహి విజయ యాత్రను విజయవంతం చేయాలని పట్టణంలో జనసేన పార్టీ నాయకులు బుధవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పక్కన ఉన్న శ్రీఆంజనేయ స్వామి దేవాలయం, ఏరియా ఆస్పత్రి సమీపంలో ఉన్న సిఎస్‌ఐ చర్చిలో, చందా సాబ్‌ దర్గాలో ప్రార్థన చేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనసేన కార్యాలయం వద్ద ర్యాలీనుద్దేశించి ఇన్‌ఛార్జీ మల్లప్ప (మల్లికార్జున) మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరిస్తే ఆదోనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నాయకులు రేణువర్మ, రాజశేఖర్‌, మహేష్‌ యాదవ్‌, ప్రకాష్‌, తాహెర్‌ వలీ, పులి రాజు, రాజశేఖర్‌ ఉన్నారు. ష