
ప్రజాశక్తి - బాపట్ల రూరల్
అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే 4వ విడుత వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ యాత్రలో జనసేన వర్గాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుండి విజయ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. సమావేశంలో జనసేన నాయకులు గుంటుపల్లి తులసి కుమారి పాల్గొన్నారు.