కిశోర్‌ను సన్మానిస్తున్న గుండుమల తిప్పేస్వామి
మడకశిర : నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడుగా ఎన్నికైన కట్ట కిషోర్ టిడిపి మడకశిర నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి కిషోర్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భక్తర్, పట్టణ అధ్యక్షుడు మనోహర్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, క్లస్టర్ ఇన్‌ఛార్జి నాగరాజు, కన్నా సాధికారిక కన్వీనర్లు గోవిందప్ప, రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.










