వాణిజ్య శాస్త్రంతో ఉన్నత కొలువులకు సువర్ణ అవకాశం
- ఎస్వీయూలో ఎంకామ్ 3 కోర్సులలో 165 సీట్లు
- ప్రతి ఏటా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వాణిజ్యశాస్త్ర విభాగంలో ఎం కామ్ కోర్సు పూర్తి చేయడం ద్వారా వివిధ వాణిజ్య రంగంలోని వివిధ విభాగాలలో ఉన్నత కొలువుతో సాధించేందుకు ఉత్తమమైన మార్గంగా ఉంటుందని మేనేజ్‌మెంటు కళాశాల ప్రిన్సిపాల్, కామర్స్ విభాగం సీనియర్ ఆచార్యులు పీవీ నర్సయ్య పేర్కొన్నారు. 'ప్రజాశక్తి' తో ఆయన మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని 2023 -24 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ పీజీ సెట్ 2023 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వాణిజ్య శాస్త్రములో చేరి తరగతులు చక్కగా హాజరై కోర్సు పూర్తి చేసిన వెంటనే అనేక రంగాలలో ఉన్నతమైన ఉపాధి అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. వాణిజ్య శాస్త్ర విద్యలో చేరిన విద్యార్థులకు దేశంలోని వివిధ ఉన్నతమైన కంపెనీలలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఎస్వీయూలో కామర్స్ విభాగానికి ప్రత్యేకమైన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. కామర్స్ విభాగానికి డిజిటల్ తరగతులు, ల్యాబ్ ఫెసిలిటీలు, క్రమ పద్ధతిగా తరగతుల నిర్వహణ, యాజమాన్యం నిర్వహణ మెలుకువలు, యాజమాన్య శిక్షణ, పద్ధతులు వంటి అంశాలపై అవగాహన సదస్సులు, సెమినార్లు డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఎస్వీయూలో కామర్స్ విభాగంలో మూడు కోర్సులు వున్నాయన్నారు. ఎంకామ్ రెగ్యులర్ (జనరల్), 2. ఎం.కామ్ ఎఫ్‌ఎం ( ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ) 3.ఎం.కామ్ ఎ అండ్ ఎఫ్ ( అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్) కోర్సులు ఉన్నాయన్నారు. ఎం.కామ్ రెగ్యులర్ ( జనరల్) కోర్సులో 50 సీట్లు, కన్వీనర్ కోటాలో 15 సీట్లు ఉన్నాయని, ఎఫ్‌ఎం కోర్సులో 50 సీట్లు, ఏ అండ్ ఎఫ్ లో 50 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. దేశంలో గాని, రాష్ట్రంలో కానీ విడుదల చేసే వివిధ రకాలైన రంగాలలో నోటిఫికేషన్లు ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఎస్‌ఎస్సి, రైల్వే బోర్డు, యుపిఎస్సి, దేశస్థాయిలో జాతీయ బ్యాంకుల వంటి నోటిఫికేషన్లు కామర్స్ రంగంలో ఉన్నత విద్యను చేసిన విద్యార్థులకు మంచి సువర్ణ అవకాశం గా పేర్కొన్నారు. అంతే కాకుండా కామర్స్ డిగ్రీ తో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, ఇతర పోటీ పరీక్షల్లో కూడా ఎం.కామ్ కోర్స్ అదనంగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్, వత్తి విద్యా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, డిబేట్లు, సెమినార్ల కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకా విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రాజెక్టు లో భాగంగా కొన్ని ఇండిస్టియల్ పార్కులు, ఫీల్డ్ ట్రిప్పులు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఎం.కామ్ చేసిన విద్యార్థులు పూర్తిస్థాయిలో రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభతో రాణిస్తున్నారని కొనియాడారు. పూర్వ విద్యార్థులు ఎంతోమంది దేశస్థాయిలో వివిధ రంగాల్లో ఉన్నతంగా రాణించడం సంతోషకరంగా ఉందన్నారు. విద్యార్థులకు మంచి నైపుణ్య శిక్షణ, నైపుణ్యాలను కలిగించేందుకు ఉత్తమ అధ్యాపకులు బోధన, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు కామర్స్ విభాగం ద్వారా ఒక మంచి ఆ ఫ్లాట్ ఫామ్, ఒక సరియైనదారి ఏర్పడి ఉన్నత రంగాల్లో రాణిం చేందుకు సహాయ కారిగా ఎంకామ్ పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందన్నారు. పీజీ సెట్ 2023 సెట్ లో ఎం.కామ్ ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులు ఎస్వీ యూనివర్సిటీలోని ఈ మూడు కోర్సులలో ఏదో ఒక ఎంపిక చేసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.










