Jun 28,2023 23:45
గడప గడపకూ దగా ప్రభుత్వం కరపత్రాలు చూపుతున్న నాయకులు

ప్రజాశక్తి-రేపల్లె: వామపక్ష పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడేందుకు జై భీమ్‌ భారత్‌ పార్టీ సంసిద్ధంగా ఉందని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌, బాపట్ల జిల్లా అధ్యక్షులు దోవా రమేష్‌ రాంజీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మాట్లాడుతూ జై భీమ్‌ భారత్‌ పార్టీ చేపడుతున్నటువంటి గడప గడపకూ దగా ప్రభుత్వం కార్యక్రమంలో భాగం గా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి చిక్కాల మణిలాల్‌, సిపిఐ బాపట్ల జిల్లా అధ్యక్షులు పి నాగాంజనేయులును కలిసి 'గడప గడపకూ దగా ప్రభుత్వం' కరపత్రాలు అందించినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ప్రతినిధులు మేధావి వర్గం కలిసి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ అధి నేత జడా శ్రావణ్‌ కుమార్‌ చేపడుతున్న ప్రజా ప్రయోజన కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికీ వివరిస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో జై భీమ్‌ భారత్‌ పార్టీని సము చిత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పెనుమాల సుబ్బారావు, రేపల్లె మండల కన్వీనర్‌ కర్రా బాబురావు, నెరసు వెంకటరావునాయుడు తదితరులు పాల్గొన్నారు.