Jul 06,2023 00:55

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-రెపల్లె : విజయవాడలోని తుమ్మలపల్లి క్షత్రీయ కళాక్షేత్రంలో ఈనెల 11న నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు యడ్లపల్లి కిషోర్‌ బాబు కోరారు. మహాసభకు సబంధించిన వాల్‌ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషోర్‌ మాట్లాడుతూ వివిధ రంగాలలో వత్తి రీత్యా పనిచేస్తున్న వారికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలిపారు. వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరూ తమ సమస్యల పరిష్కార వేదికగా మహాసభలో పాల్గొని సమస్యలు పరిష్కారానికి కార్యరూపం దాల్చడానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అద్దేపల్లి సాంబశివరావు, మోపిదేవి శివనాగేశ్వరావు, కొల్లూరు అప్పారావు, కొండేటి బాజీ, మోపిదేవి వెంకటరామయ్య, కొడాలి వెంకటరావు, ద్రాక్ష వరపు నాని పాల్గొన్నారు.