Oct 03,2023 21:13

నిందితులను చూపుతున్న డీఎస్పీ శివ నారాయణ స్వామి

ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలో సంచలనం రేపిన వాలంటీరు హరిబాబు హత్య కేసులోని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. మంగళవారం ఆదోని టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మృతుని తల్లి ఈరమ్మ ఫిర్యాదు మేరకు ఎస్పీ కృష్ణ కాంత్‌ ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిఐలు శ్రీనివాస్‌ నాయక్‌, విక్రమ సింహా, హెచ్‌సి సుదర్శన్‌, పిసి ఆంజనేయులు, హెచ్‌జి గోవర్ధన్‌ సింగ్‌ టీమ్‌గా ఏర్పడి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. విఆర్‌ఒ ముందు నిందితుడు భీమన్నతోపాటు సహకరించిన తండ్రి ఈరన్న లొంగిపోయారన్నారు. ఇద్దరు నిందితులను పోలీసుల ముందు ప్రవేశపెట్టగా హత్యకు గల కారణాలు, చేసిన విధానంపై విచారణ జరిపామన్నారు. హత్యకు వాడిన గొడ్డలి, కాల్చిన బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.