వాలంటీర్లతో మాట్లాడుతున్న కార్యదర్శి అనిల్ కుమార్
ప్రజాశక్తి-చీరాల: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందించేందుకు వాలంటీర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి ఎం కిరణ్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక రామకృష్ణాపురం పంచాయతీ కార్యాలయంలో వాలంటీర్లు సచివా లయం సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి వాలంటీర్లు అందరూ కృషి చేయాలని, వాలంటీర్లు బీమా నమోదుపై వాలంటీర్ల పరిధిలోని గృహాల లబ్ధిదారులకు అవగాహన కల్పించి సక్రమంగా నమోదు చేయాలని, జగనన్న ఇళ్లను లబ్ధిదారులు త్వరగతిన పూర్తిచేసే విధంగా లబ్ధిదారులకు వాలంటీర్లు అవగాహన కల్పించాలని పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.










