May 20,2023 19:52

వాలంటీర్లకు సన్మానం చేస్తున్న ఎంపిడిఒ గౌరీదేవి

ప్రజాశక్తి - దేవనకొండ
గ్రామాల్లో ప్రజలకు, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా పనిచేస్తున్న వాలంటీర్లు సేవలను మరింత మెరుగుపరచుకోవాలని ఎంపిడిఒ గౌరీ దేవి, ఇఒఆర్‌డి సూర్యనారాయణ, ఎంపిపి లక్ష్మీదేవి భర్త లుమాంబ తెలిపారు. శనివారం దేవనకొండ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సచివాలయ 1, 2వ వాలంటీర్లకు సేవా మిత్రా ప్రశంసా పత్రం అందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో వాలంటీర్ల పాత్ర ప్రశంసనీయమన్నారు. సచివాలయ వెల్ఫేర్‌ అధికారులు సూచించిన పనుల్లో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శులు అబ్దుల్‌ రహీం, రిబిక, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ అధికారులు రామకృష్ణ, స్వాతి పాల్గొన్నారు.