ప్రజాశక్తి - దేవనకొండ
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పని చేస్తూ సంక్షేమ పథకాలను చేరవేస్తున్న వాలంటీర్లు సేవలను మరింత మెరుగుపరచుకోవాలని ఎంపిడిఒ గౌరీ దేవి, ఎంపిపి లక్ష్మీదేవి భర్త లుమాంబ, సర్పంచి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తెర్నేకల్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వాలంటీర్లకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాలంటీర్లు ఇంకా బాగా పని చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు. గ్రామానికి చెందిన కరిష్మాకు సేవారత్న, ప్రశంసాపత్రం, శాలువాతో సన్మానించి సిల్వర్ మెడల్ అందజేశారు. మిగిలిన వాలంటీర్లకు సేవా మిత్ర ప్రశంసా పత్రం అందించి సన్మానించారు. ఉప సర్పంచి సులోచనమ్మ భర్త బెల్ ఈరన్న, ఎంపిటిసి నామాల శ్రీను, వార్డు మెంబర్లు కట్టమీది వెంకటేష్, దొడ్డప్ప, సువర్ణ భర్త బడేసాబ్, మహాలక్ష్మి భర్త చిన్నరాముడు, పంచాయతీ కార్యదర్శులు తలారి రాముడు, సునీత, వైసిపి కార్యకర్తలు నాగన్న, కుమ్మరి మోహన్, చాకలి తిమ్మప్ప పాల్గొన్నారు.
వాలంటీర్లను సన్మానిస్తున్న సర్పంచి అరుణ్ కుమార్










