మాట్లాడుతున్న కలెక్టర్
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ లిస్ట్ సర్వేలో గ్రామ వాలంటీర్లను తీసుకెళ్లకుండా అధికారులే నిర్వహించాలని స్థానిక జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఓటర్ లిస్టు సర్వేలో భాగంగా బిఎల్‌ఓలు, అధికారులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఓటర్ లిస్టులు చేర్పించడానికి ఓటర్ నమోదు చేసే ప్రక్రియపై బిఎల్‌ఓలకు కలెక్టర్ అవగాహనపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటర్ లిస్టు నమోదులో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరించకుండా బిఎల్‌ఓ లు, అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ సిహెచ్ నాగమ్మ, ఎంపీడీవో ఉషారాణి, అధికారులు పాల్గొన్నారు.










