Jul 12,2023 20:45

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

రాజంపేట రూరల్‌ : వాలంటీర్లను గురించి మాట్లాడే అర్హత పార్ట్‌ టైం పొలిటీషియన్‌ పవన్‌కళ్యాణ కు లేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం మండలం మిట్టమీదపల్లి గ్రామ సచివాల యంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్ర మానికి వారు ముఖ్య అతిథులుగా హాజర య్యారు. జగనన్న సురక్ష కార్యక్ర మంలో అర్హులైన 123 మంది లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. వాలంటీర్ల ద్వారా అర్హత కలిగిన లబ్దిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తా మన్నారు. పవన్‌ వ్యాఖ్యలకు వాలంటీర్లు అధైర్య పడనవసరం లేదన్నారు. కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షులు రామ్మోహన్‌నాయుడు , రాజంపేట గ్రామీణ జెసిఎస్‌ కన్వీనర్‌ మందరం గంగిరెడ్డి, జడ్‌పిటిసి ప్రతినిధి దాసరి పెంచలయ్య, ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, నాగేశ్వర్‌ నాయుడు, కె.వెంక టేష్‌, నరసింహులు, పోలి మురళీరెడ్డి, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు. కార్య కమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.పుల్లంపేట : మండలంలోని అప్పయ్యరాజుపేట గ్రామ సచివా లయంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వవిప్‌ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాల అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామ ప్రజలు వివిధ సమస్యలను ఎమ్మెల్యే, సీని యర్‌ నాయకులు కొల్లం గంగిరెడ్డిల దష్టికి తీసుకొని రాగా రూ.20 లక్షలు మం జూరు చేస్తామని మండల కన్వీనర్‌ ముస్తాక్‌ హామీ నిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పార్టీ సీని యర్‌ నాయకులు కొల్లంగంగిరెడ్డి, ఎపిఎస్‌సి వెల్ఫేర్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ మడ గలం శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ సల హాదారు సంఘం చైర్మన్‌ పంజం సుకుమార్‌ రెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌రాజు బికె మణి, మల్లికార్జున్‌, భాస్కర్‌, తహశీల్దార్‌, గ్రామ సచి వాలయ సిబ్బంది పాల్గొన్నారు. సుండుపల్లి : వాలంటీర్లపై జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని జెసిఎన్‌ కన్వీనర్‌ రహమాన్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఎంపిడిఒ కార్యాలయంలో వాలంటీర్లతో కలిసి సమా వేశం నిర్వహిం చారు. పవన్‌ దిష్టి బొమ్మ ను దగ్ధం చేసి నిరసన చేపట్టారు. అనం తరం ఎంపిడిఒ కార్యాలయంలో ఇన్‌ఛార్జి రాజశేఖర్‌కు వినతి పత్రం సమర్పించారు.మదనపల్లె అర్బన్‌ : వాలం టీర్లపై జనసేన అదినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు వాలంటీర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్య కులు పూజారి ఉదరు కుమార్‌, కార్యవర్గ సభ్యులు నీరుగట్టి రాజేష్‌, జిల్లా అధ్యకులు జమాల్‌వల్లి, మండల అధ్యకులు వెంకటపతిలు తెలిపారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యా లయం ఎదుట నిరసన తెలిపి పవన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఎఒకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎపిఎండిసి చైర్‌పర్సన్‌ జి.షమీంఅస్లాం, కౌన్సిలర్‌ బిఎ.ఖాజా, కరీముల్లా, వాలంటీర్లు పాల్గొన్నారు.