Jun 03,2023 23:20

వాలంటీర్లను సత్కరిస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి తదితరులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం వందనం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి వాలంటీర్లకు శాలువ కప్పి ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల వద్దకే నేరుగా అందుతున్నాయని తెలిపారు. ప్రతినెల ఒకటో తేదీ రాగానే పింఛన్‌దారులకు నేరుగా ఇంటివద్దుకే వచ్చి పెన్షన్‌ అందజేస్తున్నారని పేర్కొన్నారు. వారికిచ్చే రూ.5000 గౌరవ వేతనంతో పాటు ప్రతి ఏలా ఇలాంటి పురస్కారాలు ఏర్పాటు చేసి వారు చేసే సేవకు గుర్తింపు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గోము వెంకటలక్ష్మీ, జెడ్పిటీసి ఒడుగుల జ్యోతి, సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, వైస్‌ ఎంపిపిలు జె.రాజేశ్వరి, చప్పా చంద్రరాణి, ఎంపిడిఓ కె బాపన్నదొర, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.