May 22,2023 23:41

వాలంటీర్ల సన్మానంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-యంత్రాంగం
భీమునిపట్నం : మండలంలో సేవా మిత్ర, సేవా రత్న అవార్డులకు ఎంపికైన వాలంటీర్లను రేఖవానిపాలెం పంచాయతీలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, నవ రత్నాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్ల కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. సర్పంచ్‌ సమ్మిడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపిపి డి.వాసురాజు, ఎఎంసి చైర్మన్‌ యలమంచిలి సూర్యనారాయణ, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఎండిఒ పి.వెంకటరమణ, తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం : ఆనందంలో మండలం బోని పంచాయతీలో వాలంటీర్లను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడప గడపకూ వెళ్లి నేరుగా ప్రజలకే సేవలందేలా వాలంటీర్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెచ్చారన్నారు. వాలంటీర్లు మరింత బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం మండలంలోని 230 మంది వాలంటీర్లను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ లవరాజు, జడ్‌పిటిసి సభ్యులు కోరాడ వెంకటరావు, ఎంపిపి మజ్జి శారదాప్రియాంక, వైస్‌ ఎంపిపి పాండ్రంగి శ్రీను, బొట్ట ధనలక్ష్మి రామకృష్ణ, బంక సత్యనారాయణ, అప్పలనాయుడు, బోని అప్పలకొండ, సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.