వాలంటీర్లను సన్మానిస్తున్న జడ్పిటిసి జ్యోతి రామలింగేశ్వర రెడ్డి తదితరులు
వాలంటీర్ల సేవలు అభినందనీయం : జడ్పిటిసి
ప్రజాశక్తి - పాములపాడు
ప్రభుత్వ పథకాలను సూర్యుడు ఉదయించక ముందే ప్రతి ఇంటికి చేరవేసే వాలంటీర్ల సేవలు ఎంతో గొప్పవని పాములపాడు జడ్పిటిసి జ్యోతి రామలింగేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జూటూరు, తుమ్మలూరు గ్రామాలలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులను అందజేశారు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తిస్తుందని ఆమె అన్నారు. అనంతరం వాలంటీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వనమాల ప్రసాదరావు, ఏవో కర్ణ సాగర్, పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, నాయకులు రామలింగేశ్వర రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










