ప్రజాశక్తి - తాళ్లరేవు
వాలంటీర్లంతా సేవా భావంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడం అభినందనీ యమని తాళ్లరేవు ఎంపిపి రాయుడు సనీత అన్నారు. గాడిమొగలో సర్పంచ్ కామాడి గోవలక్మి, కోరంగిలో సర్పంచ్ పెయ్యల మంగేష్‌ల అధ్యక్షతన నిర్వహించిన సభలలో వాలంటీర్లను ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో ముమ్మిడివరం ఎఎంసీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, జడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, వైస్ ఎంపిపి కొపనాతి లలిత, ఉప సర్పంచులు కొక్కిలిగడ్డ లోకేష్, కె.బైరవమూర్తి, ఎంపిడిఒ అనుపమ, ఎంపిటిసిలు రేకాడి నరసింహ మూర్తి, కామేశ్వరరావు, పోసియ్య, పంచాయతీ కార్యదర్శులు విజెవి రమణ, రామరాజు పాల్గొన్నారు. పెదపూడి మండలం జి.మామి డాడలో నాలుగు సచివాలయాల పరిధిలో పైన, రాజుపాలెం గ్రామాల్లో సేవా వజ్ర. సేవా రత్న, సేవా మిత్ర గ్రామ వలంటీర్లను ఘనంగా సోమవారం ఎంపిపి కేతా తులసి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి పేపకాలయ వెంకటలక్ష్మి, ఇన్చార్జి ఎంపిడిఒ కర్రి హరికృష్ణ సత్యరెడ్డి, సర్పంచులు లంక మున్ని, సుందరపల్లి ప్రమీళ, ఉప సర్పంచి మేడపాటి తాతారెడ్డి, మండల పరిషత్ కోఆప్షనసభ్యుడు కర్రి శ్రీ వెంకటరెడ్డి, వైసిపి రాష్ట్ర ప్రచారకమిటీ కార్యదర్శి మండ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గాడిమొగలో వాలంటీర్లను సత్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు










