వాలంటీర్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ
ప్రజాశక్తి - జూపాడుబంగ్లా
గుండెపోటుతో అకాల మరణం పొందిన జూపాడుబంగ్లా గ్రామ వాలంటీర్ రీయాజుద్దీన్ కుటుంబ సభ్యులను నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పరామర్శించారు. ఈ నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండగా రియాజుద్దీన్ గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోతే బాలయ్య, వైసీపీ మండల నాయకులు జంగాల పెద్దన్న, కిరణ్ కుమార్ రెడ్డి, ఉస్మాన్ బాష, శివానంద రెడ్డి, దేవ సహాయం, డాక్టర్ ఎర్రన్న, నక్క మల్లికార్జున, ఈఓఆర్ డి మణిమంజరి, పంచాయతీ కార్యదర్శి శాంతయ్య, తదితరులు పాల్గొని రియాజుద్దీన్ చిత్రపటానికి నివాళులర్పించారు.










