ప్రజాశక్తి - పోలవరం
అనారోగ్యంతో ఎక్కడో దూర ప్రాంతంలో చికిత్స పొందుతున్న వృద్ధురాలి వద్దకు ఆదివారం వెళ్లి, పింఛన్ అందజేసి తన ఔదార్యాన్ని, మానవత్వాన్ని, ఉద్యోగం పట్ల అంకిత భావాన్ని చాటుకున్నాడు పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేట గ్రామ సచివాలయ వాలంటీర్ కె.మోహన్. వివరాల్లోకి వెళ్తే ఎల్‌ఎన్‌డి పేటకు చెందిన బొంగు గంగమ్మ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స పొంది, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సింగవరంలో తన కూతురి ఇంటి వద్ద ఉంటూ చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న వాలంటీర్ గోదావరి దాటి వెళ్లి వృద్ధురాలికి పింఛన్ అందించారు. వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసిన మోహన్‌ని పలువురు అభినందించారు.










