హిందూపురం : రాష్ట్రంలో వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర వాల్మీకి, బోయ కార్పొరేషన్ ఛైర్మన్ పొగాకు రామచంద్ర పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హిందూపురం పట్టణం గుడ్డం ప్రాంతంలో పొగాకు రామచంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వాల్మీకి సంఘం నేతలు పొగాకు రామచంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పొగాకు రామచంద్ర మాట్లాడుతూ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమన్నారు. వాల్మీకి, బోయల సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మరోమారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి వాల్మీకి కుటుంబ సభ్యులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నేతలు గాంధీ, డిఆర్‌జి శ్రీనివాసులు, వెంకటేశులు, రమేష్, చిరు, అనిల్, లక్ష్మీనారాయణ, పాదయాత్ర నటేష్ పాల్గొన్నారు.










