
ప్రజాశక్తి-విజయనగరం : మహర్షి వాల్మీకి జయంతిని శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ అనిత మాట్లాడుతూ రామాయణం వంటి మహాగ్రంథాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి చిరస్మరణీయులని కొనియాడారు. రామాయణం మన జీవన విధానానికి ఒక మార్గమన్నారు. కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమాధికారి యశోదనరావు, బోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పువ్వల వెంకటరావు, రెడ్డిక సంక్షేమ సంఘం డైరెక్టర్ భాస్కరరెడ్డి, ఎబిసిడబ్ల్యూఒలు శ్యామలకుమారి, రాజులమ్మ పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి ఎఎస్‌పి అస్మా ఫర్హీన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఆర్ డిఎస్‌పి యూనివర్స్, ఆర్‌ఐలు ఎన్.గోపాల నాయుడు, రమణమూర్తి, డిసిఆర్‌బి ఎస్‌ఐ వాసుదేవ్, ఆర్‌ఎస్‌ఐలు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రసాద్, నీలిమ, నారాయణరావు, కేశవరావు, రాంబాబు పాల్గొన్నారు.