May 22,2023 19:18

పూజలు చేస్తున్న గుడిసె కృష్ణమ్మ

ప్రజాశక్తి - ఆదోని
వాల్మీకి మహర్షి మహనీయుడని నాయకులు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని కల్లుబావిలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. మహర్షి వాల్మీకి విగ్రహానికి ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి, టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ, సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌ జైన్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. వాల్మీకి మహర్షి, ఆయన జీవన విధానం, జీవనశైలి నేటి తరానికి బాసటగా నిలిచాయని కొనియాడారు. రామాయణం వాల్మీకి మహర్షి రాయకపోతే మనందరికీ తెలిసేది కాదన్నారు. అలాంటి మహానుభావుని వారసులైన వాల్మీకులందరూ కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్‌ సాధన కోసం మరింత ఉధృతంగా పోరాటాలు చేయాలని కోరారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ వివరించారు. వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, చంద్రకాంత్‌ రెడ్డి, కామాక్షి తిమ్మప్ప, సింహం నాగేంద్ర, కామాక్షి నారాయణ, వాల్మీకి నాయకులు స్కూల్‌ ఛైర్మన్‌ రాజు, మల్లికార్జున, శ్రీనివాసులు, చిన్నస్వామి, వీరేష్‌, శంకరమ్మ, డ్రమ్ము వీరేష్‌, గోల్డ్‌ ఈరన్న, శేఖర్‌ కుమార్‌, వీరభద్ర రెడ్డి, మాధవరెడ్డి, షేక్షావలి ఉన్నారు.