Oct 28,2023 20:57

వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం : డిఆర్‌ఒ

 కడప అర్బన్‌ : వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిసిల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. వాల్మీకి జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడిచి తమ జీవిత లక్ష్యాలను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలన్నారు. మొట్ట మొదటి శ్లోకం మనకు అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని కొనియాడారు. ఆది కవి వాల్మీకి రామా యణంలో దాదాపు 20 వేల శ్లోకాలు రాశారని, అందరూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దైనందిన జీవితంలో స్పూర్తితో జీవించాలన్నారు. వేల సంవత్సరాల కిందటే జ్ఞానం ఒకరి సొత్తు కాదని, కషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమే అని, అది బోయ వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విష యంలో నిరూపితమైందని అన్నారు. ముందుగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ, సాధికార ఇంచార్జి అధికారి డి.క్రిష్ణయ్య, స్టెప్‌ సిఇఒ సాయి గ్రేస్‌, రాష్ట్ర హస్త కళల ఛైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, వాల్మీకి ఎంప్లా యిస్‌ అధ్యక్షులు శ్రీనివాసులు, బిసి మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు మల్లి కార్జున, పూలే విగ్రహ సాధన అధ్యక్షులు రమణయ్య, తలాడి కులము రాష్ట్ర ఉ పాధ్యక్షులు సుంకర వాగేశ్వరరావు, ఎస్‌సి కులం మహా జన అధ్యక్షులు సంగటి మనోహర్‌, బిసి సంక్షేమ జాతీయ కార్యదర్శి చంద్రమౌళి, ఉద్యాన శాఖ రాష్ట్ర ప్రభు సలహాదారారు ఎన్‌.ప్రసాద్‌ రెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్‌