Oct 28,2023 21:11

వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ గిరిష పిఎస్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక రాయచో టిలోని కలెక్టరేట్‌లో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన నేడు మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుం టున్నామ న్నారు. కషి ఉంటే మనుషులు రుషుల వుతారు అని తెలియజేయడానికి వాల్మీకి మహర్షి ఒక ఉదాహరణ అని అన్నారు. బోయ కులాని చెందిన వాల్మీకి రామా యణాన్ని రచించి మహర్షి అయ్యాడన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎఒ బాలకష్ణ, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ అధికారి సందప్ప పాల్గొన్నారు.
ఆదికవి వాల్మీకి : ఎమ్మెల్యే
రాయచోటి టౌన్‌ : ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో మానవతా విలువలు పెంపొందటానికి దోహదం చేసిన మహౌన్నతుడు శ్రీ వాల్మీకి మహర్షి అని వైఎస్‌ఆర్‌ సిపి రాయచోటి అన్న మయ్య జిల్లాఅధ్యక్షుడు, ఎంఎల్‌ఏ శ్రీకాం త్‌రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని బస్‌ స్టాండ్‌ మార్గంలో వాల్మీకి విగ్రహావిష్కరణ, జయంతి వేడుకలును వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష ,కౌన్సిల ర్లుతో కలసి అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వాల్మీకి విగ్రహాన్ని అవిష్క రించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకులును ఎస్‌టిలో చేర్చే అంశం పై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. వాల్మీకుల సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్నా మన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఫయాజర్‌ రెహమాన్‌, కౌన్సిలర్లు గువ్వల లక్ష్మీదేవి, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, రియాజ్‌, గౌస్‌ ఖాన్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, షబ్బీర్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌,సుగవాసి శ్యామ్‌,పి ఆర్‌ టి యు రాష్ట్ర గౌరవా ధ్యక్షుడు శ్రీనివాసరాజు,బి సి సెల్‌ విజయ భాస్కర్‌, లక్కిరెడ్డిపల్లె బిసి నాయకుడు విజయభాస్కర్‌, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు చుక్కా అంజనప్ప, గువ్వల జగదీష్‌ పాల్గొన్నారు
మదనపల్లె అర్బన్‌: మదనపల్లె నియో జకవర్గం పరిధిలోని వాల్మీకిబోయ కుల స్తులు పార్టీలకు అతీతంగా వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను నిర్వహించాలని వాల్మీకీ రిజర్వేషన్‌ సాధన సమితి అధ్యక్షులు పొదల నరసింహులు పేర్కొ న్నారు. శనివారం పట్టణంలోని చిత్తూరు బస్టాండ్‌ వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు మాలతి బొగ్గిటి క్రిష్ణమూర్తి, మారా కష్ణమూర్తి, ఉడుము శంకర, సరోజమ్మ, గౌరమ్మ, కమలమ్మ, గాయిత్రి, శ్రీనివాసులు, కమలాకర్‌, గిరిధర్‌, కాటినేని సూరి, శ్రీరాములు, మల్లికార్జున, ఈశ్వర్‌, రామకష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
రాజంపేట అర్బన్‌ : పట్టణంలో వాల్మీకి జయంతిని ఆ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మాన్ని ఎలా రక్షించాలో వాల్మీకి మహర్షి తన రామా యణం ద్వారా ప్రజలకు అందించి మనిషిని సన్మార్గంలో నడిపించేందుకు విశేష కషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ ఈశ్వరయ్య, పెంచలయ్య, శంకరయ్య, శ్రీహరి, నాగరాజ, నరసింహ, గణేష్‌, మణి, వెంకటేష్‌ పాల్గొన్నారు.