ఆకాశానికి తాడు గట్టి
గాల్లో ప్రాణాల వదిలిపెట్టి
ఒంటి చేత బ్రష్ పట్టి
అంతస్థుల మేడలకు
అందమైన రంగులేసే
ఆ నవ యువకులు
నిరుద్యోగులు...
ఉద్యోగాలివ్వలేని
సర్కారు అసమర్థతను
కుంచెతో బొమ్మలేస్తూ
ఏ జాబ్‌కైనా
జవాబు మా దగ్గరుందని
చాటే సమర్థులు...
పీజీలు చేసినోళ్లు
ప్రొఫెసర్ స్థాయి వాళ్ళు
కాబోయే జర్నలిస్టులు
చరిత్ర విద్యార్థులు
ప్రశ్నించే గొంతులు
ఆత్మగౌరవ పతాకలు
పోరు నినాదం రాస్తున్నారు
చదువుల సారాన్ని విప్పి
ఆచరణలో నిరూపించ
పనికి తగ్గ వేతనమివ్వాలని
శ్రమని దోచి సిరిని దాచుకునే
దళారీ వర్గ జులుం
చెల్లదు గాక చెల్లదింకని
నిలదీస్తున్నారు...
అంబేద్కర్ రాజ్యాంగాన్ని
భగత్‌సింగ్ వారసత్వాన్ని
నిలువెల్లా నింపుకొని
కార్మికహక్కుల సాధనకు
ఉద్యమాన్ని రచిస్తున్నారు
వాళ్ళిప్పుడు...
చేవ సచ్చిన యువతరానిక్కూడా
చైతన్యం నింపుతూ
దేశపటాన్ని నూతనంగా గీస్తున్న
ఆధునిక కంప్యూటర్ తరానికి
స్ఫూర్తి దాతలు...
కార్తీక్
9533263057