ప్రజాశక్తి - గణపవరం
ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో ఉంగు టూరు నియో జకవర్గస్థాయి వాలీబాల్ పోటీలను ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) సోమవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయని అన్నారు 21న జరిగే రక్తదాన శిబిరాన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు










