Sep 20,2023 21:49

ప్రజాశక్తి - ఆచంట
            గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ఐక్యతను చాటుతాయని మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌ అన్నారు. ఆచంట నియోజక వర్గస్థాయిలో అండర్‌-14, అండర్‌-17 బాలుర వాలీబాల్‌ పోటీలు కొడమంచిలి హై స్కూల్‌ ఆవరణలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సీతారామ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో నియోజకవర్గం నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఎస్‌జిఎఫ్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కృష్ణారెడ్డి, స్కూల్‌ పీడీ చిరంజీవి పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు.