Feb 20,2023 23:45

సర్టిఫికెట్‌ చూపుతున్న విద్యార్థి, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -మునగపాక రూరల్‌
మండలంలోని తోటాడ జిల్లా పరిషత్తు హైస్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న అంగుళూరు లాకేష్‌ (13) అంతర్‌ జిల్లాల వాలీబాల్‌ పోటీలలో తన సత్తాను చాటుకున్నాడు. స్కూల్‌ గేమ్స్‌ పెడరేస్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 16 వరకు పలనాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన 66వ అంతర్‌ జిల్లాల వాలీబాల్‌ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి 12 మంది పాల్గొన్నారు. వీరు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు కుమార్‌, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ సూరిశెట్టి భాస్కరరావులు లాకేషను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు క్రీడలపై మక్కువ చూపాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వివి పద్మావతి, సిహెచ్‌ఆర్‌ కృష్ణమూర్తి, ఫిజికల్‌ డైరెక్టర్‌ గండి గోవిందరావు, సిఆర్పి మద్దాల గోవింద, కాండ్రేగుల వెంకటరెడ్డి, వర్మ తదితరులు పాల్గొన్నారు.