Apr 20,2023 01:31
మనో వికాస కేంద్రానికి సరుకులు అందిస్తున్న షేక్‌ దరియా సాహెబ్‌

ప్రజాశక్తి-చీరాల: వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దేశాయిపేట అనాథ శరణాలయం కమిటీ మెంబర్‌ షేక్‌ దరియా సాహెబ్‌ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని చైతన్య మనోవికాస మానసిక దివ్యాంగుల కేంద్రం అవసరాల నిమిత్తం ఆయన బియ్యం, నిత్యవసర సరుకులను బుధ వారం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ అండ్‌ పీఎం హైస్కూల్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ తమ అసోసియేష న్‌ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా మనోవికాస కేంద్రానికి చేయూతని అందించామని అన్నారు. అసోసియేషన్‌ ప్రతినిధులు అమర వీరాంజనేయు లు, పోలుదాసు రామకృష్ణ, డివి సురేష్‌, చారుగుళ్ల ప్రసాద్‌, గుర్రం బదిరి, ఎంఎస్‌, మధుసూదన్‌రావు, డేగల తిరుపతి రావు, పూర్ణచంద్రరావు, సుభాషిణి, వాకర్స్‌ పోస్టల్‌ ఏజెంట్లు పాల్గొన్నారు.