రామాపురం : గుర్తుతెలియని వాహనం ఢకొీని దుప్పి మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే... మండలంలోని కసిరెడ్డిగారిపల్లె సమీ పంలోని పాలకొండ నుంచి దుప్పి గ్రామ శివారులో పంట పొలా ల్లోకి వెళ్లింది. దుప్పిని కుక్కలు తరమడంతో తప్పించుకునే క్రమంలో రోడ్డు దాడుతుండగా గుర్తుతెలియని వాహనం ఢకొీనడంతో దుప్పి అక్కడికక్కడే మృతి చెందింనట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రెడ్డప్ప తెలిపారు. రాయచోటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు మృతి చెందిన దుప్పిని శవ పరీక్ష నిమిత్తం గువ్వల చెరువు పశువుల వైద్యశాలకు తరలించారు. డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి శవ పరీక్ష నిర్వహించారు. శవ పరీక్ష అనంతరం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. అటవీ అధికారులు దుప్పికి దహన సంస్కారాలు చేశారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ గాయత్రి, బేస్ క్యాంప్ సిబ్బంది నాగేష్, గోపాల్, రెడ్డయ్య పాల్గొన్నారు.










