Nov 04,2022 23:30

సమావేశంలో మాట్లాడుతున్న సంఘం అధ్యక్షులు అశోక్‌కుమార్‌

ప్రజాశక్తి- పెదబయలు: శ్రీ మోద యేసు సాయి ఆటో యూనియన్‌ కార్మికుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎస్సై పులి మనోజ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు అరడకోట మైదానంలో పెదబయలు, అరడకోట, సీకరి, వనభంగి, గలగండ పంచాయతీల ఆటో వాహనదారులు, డ్రైవర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్‌ అధ్యక్షుడు మునగ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి వాహనదారుడు రికార్డులను, లైసెన్సులను కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని, అధిక వేగం, కెపాసిటీకి మించిన లోడును ఎక్కించరాదని సూచించారు. పోలీస్‌లు జారీ చేసిన పిఎస్‌ నెంబరర్‌ను వాహనంపై కచ్చితంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.పెదబయలు నుండి బంగారమెట్ట వరకు గోతుల మయంగా ప్రధాన రహదారి ఉండటంతో వీటిని పూడ్చేందుకు ఆదివారం వాహనదారులు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో ఉప అధ్యక్షుడు సీకరి సన్యాసిదొర, కార్యదర్శి కృష్ణారావు పాల్గొన్నారు.