Oct 19,2022 23:05

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు


ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌: అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తునట్లు అరకులోయ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ జి దేముడుబాబు చెప్పారు. బుధవారం అరకులోయ మండల కేంద్రంలోని గవర్నమెంట్‌ హైస్కూల్‌, తదితర ప్రదేశాల్లో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహన దారులందరూ కచ్చితం గా రికార్డ్‌లను ఉంచు కోవాలన్నారు. రికార్డ్స్‌ లేకపోతే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుం టామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.