మావోయిస్టులు తగలబెట్టి లారీ
ప్రజాశక్తి-చింతూరు
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం మావోయిస్టులు మూడు ఇసుక రవాణా వాహనాలను తగలబెట్టారు. జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం... కొడపాల్ క్యాంపు సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలో ఇసుక తీసుకు వెళుతున్న మూడు వాహనాలను మావోయిస్టులు అటకాయించి వాటిపై డీజిల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన మేడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మావోయిస్టుల దారి నుండి సిబ్బంది ప్రాణాలను కాపాడుకుని అడవుల్లోకి పరుగులు తీశారు. మావోయిస్టుల చర్యతో పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నాయి.










