Oct 20,2023 22:08

వాహనాలకు జిపిఎస్‌ వేస్తున్న పౌరసరఫరా డిఎం నాయక్‌

సీతానగరం: రానున్న ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్‌ తప్పనిసరని సివిల్‌ సప్లై డిఎం దేవుళ్ళ నాయక్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని సివిల్‌ సప్లై సిబ్బందితో కలిసి వాహనాలకు జియో ట్యాగ్‌ చేసే విధానాన్ని నిర్వహించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 3,800 వాహనాలను ధాన్యం సరఫరా కోసం ఇప్పటికే గుర్తించామని తెలిపారు. వాహనాల యజమానులు తప్పని సరిగా వాహనాలకు జియో ట్యాగ్‌ చేసుకోవాలని, లేదంటే వారికి రవాణా ఛార్జీలు చెల్లించమని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్లో 3లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలో 7మండలాల్లో రాగులు కోనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.