పార్కింగ్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్
ప్రజాశక్తి -అనంతగిరి:బొర్రా గుహల వద్ద వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించామని స్థానిక సర్పంచ్ జన్ని. అప్పారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొర్రా గుహల సందర్శనకు వచ్చే టూరిస్టుల వాహనాల నిలుపు స్థలం లేక అవస్థలు పడుతున్నారని, ఈ ఉద్దేశంతో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. బైకుకు రూ. 10, ఆటో రూ.20, కారులకు రూ.30 నుండి 50 రుసుము వసూలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










